Breaking News

బోనులో పులి బయటకు..

revanth-reddy_

బోనులో ఆకలిగొన్న పులి ఎలా ఉంటుందీ.. వదిలేస్తే ఎలా బయటకొస్తుంది.. అదిగో అలానే జనంలోకి ఉప్పెనలా వచ్చారు టీడీపీ ఎమ్మెల్యే ఓటుకు నోటులో నిందితుడు రేవంత్ రెడ్డి. ఆయనకు టీడీపీ శ్రేణులు బహ్మరథం పట్టారు. కేసీఆర్ నే ఢీకొట్టిన యోధుడు అంటూ ఫ్లెక్సీలు , భజనలతో చర్లపల్లి జైలు ప్రాంతం మార్మోగిపోయింది.

రేవంత్ నెల రోజులు జైల్లో ఉన్నా తన వాగ్ధాటిని , కేసీఆర్ టీఆర్ఎస్ పై మాటల దాడిని కొంచె కూడా తగ్గించకపోవడం గమనార్హం. బెయిల్ విడుదలైన అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ మంత్రులు సన్నాసులని, మోండా మార్కెట్ లో కూరగాయలమ్మేవారని.. వారు మంత్రులయ్యారని దుయ్యబట్టారు. అంతేకాదు తాగుబోతు కేసీఆర్ అధికారయంత్రాంగాన్ని అంతావాడుకొని తనను ఇరికించారని మండిపడ్డారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలే కొట్టి చంపే రోజులు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ను గద్దె దింపడమే నా ధ్యేయమని.. ఇందుకోసం తెలంగాణ లోని ప్రతి వ్యక్తి భుజం తట్టి కేసీఆర్ కు వ్యతిరేకంగా తిరుగుతానని స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *