Breaking News

బోనాల ఆర్థిక సహాయం కోసం 12 వ తేది లోగా ధరఖాస్తు చేసుకోవాలి: హోం మంత్రి నాయిని

బోనాల ఆర్థిక సహాయం కోసం 12 వ తేది లోగా ధరఖాస్తు చేసుకోవాలి: హోం మంత్రి నాయిని

బోనాల పండుగ సందర్భంగా ఆర్థిక సహాయం కోరుకునే దేవాలయాల కమీటీలు దేవాదాయ శాఖ అధికారులకు ఈ నెల 12 వ తేది లోగా ధరఖాస్తు చేసుకోవాలని బోనాల ఉత్సవ కమిటీ చైర్మెన్ మరియు రాష్ట్ర హోం కార్మిక శాఖా మంత్రి నాయిని నర్సింహ రెడ్డి సూచించారు. సచివాలయంలోని తన కార్యలయంలో శనివారం నాడు మంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటి సి.ఎం. ఎం.డి. మహమూద్ అలి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు గౌడ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి 20 వ తేది లోగా ఆర్థిక సహాయం అందజేయనున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి 15 కోట్ల రూపాయలను మంజూరు చేశారని తదనుగుణంగా హైదరాబాద్ లోని దేవాలయాలకు అర్థిక సహయాన్ని పెంచుతున్నామని తెలిపారు. అదే విధంగా ఇప్పటి వరకు ఆర్థిక సహయం పొందని దేవాలయాల కమీటీలు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త దేవాలయాల కమీటీలకు ఆర్థిక సహాయాన్ని అందించటంతో పాటు ఇప్పటికే ఆ జాబితాలో వున్న ఆలయ కమీటీలకు అందించే మెత్తాలను పెంచుతున్నామని వెల్లడించారు. దేవాదాయ శాఖా ముఖ్య కార్యదర్శి ఎన్. శివ శంకర్, డిప్యూటి కమీషనర్ రామకృష్ణ, సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరి కృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *