Breaking News

బోట్లలో ప్రయాణించే పర్యాటకుల భద్రత పై చర్యలు చేపట్టాలి: బుర్రా వెంకటేశం

బోట్ల పర్యాటకుల భద్రత పై చర్యలు చేపట్టాలి: బుర్రా వెంకటేశం

రాష్ట్రంలో ఉన్న వివిధ జలాశయాలలో తెలంగాణ టూరిజం శాఖ పర్యాటకుల కోసం నిర్వహిస్తున్న బోట్లు పర్యాటకుల భద్రత పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం.

ఈ సమావేశంలో హుస్సేన్ సాగర్ జలాశయంతో పాటు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న జలాశయాలలో పర్యాటక చిన్న, పెద్ద తరహా బోట్లు లో ప్రయాణించే పర్యాటకులతో పాటు బోటు డ్రైవర్, సిబ్బంది విధిగా సెక్యూరిటీ జాకెట్లు ధరించాలని టూరిజం కార్యదర్శి ఆదేశించారు. ప్రతి బొట్టింగ్ పాయింట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం ఆదేశించారు.

బొట్లలో పరిమితికి మించి ఒక్క పర్యాటకుడిని కూడా అనుమతించవద్దన్నారు. సామాన్యుల నుంచి  వివిఐపి లకు కూడా ఒకే నిబంధనలను పాటించాలి. బొట్లలో ప్రయాణించటానికి వచ్చిన పర్యాటకులను గౌరవించడం తో పాటు విధిగా సెక్యురిటి జాకెట్ ను ధరించే విధంగా అవగాహన ను కల్పించాలని కోరారు. బొట్లలో సెక్యూరిటీ జాకెట్ ను ధరించని పర్యాటకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని సమావేశంలో తెలిపారు.

బోట్ లలో పర్యాటకులకు అర్ధమయ్యే భాషలో నియమ నిబంధనలను నోటీస్ బోర్డు పై తెలపాలని సూచించారు.  బొట్ల ఫిట్నెస్, డ్రైవర్ల లైసెన్సు రెన్యూవల్ పై దృష్టి సారించి విధిగా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ను కేంద్ర కార్యాలయం కు పంపించాలని ఆదేశించారు.  పర్యాటకులకు అవసరమైన కొత్త సెక్యూరిటీ జాకెట్స్ ను త్వరగా కొనుగోలు చేయాలన్నారు తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *