
గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లల్లో అత్యంత విలువైన స్థలం బోజగుట్ట. ఈ బోజగుట్టలో నివసిస్తున్నవారికి కేటాయించే డబుల్ బెడ్‌రూం ఇంటి మార్కెట్ వాల్యూ దాదాపు 40లక్షల రూపాయల వరకు ఉంటుంది. బోజగుట్టలో ఉంటున్న 1,824 మంది నిరుపేదలకు 13ఎకరాల స్థలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను రూ. 141.36 కోట్ల వ్యయంతో చేపట్టారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో ఈ బోజగుట్టలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. కేవలం పది గజాలలోపు విస్తీర్ణంలో 213 కుటుంబాలు నివసిస్తున్నాయంటే ఈ బోజగుట్ట మురికివాడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే మొత్తం 1,824 మంది నివాసితుల్లో కేవలం 230 మంది డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు నిరాకరిస్తూ ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలను కూడా అడ్డుకోవడంతో బోజగుట్టలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అయితే ఈ 230 మందిలో ఇప్పటికే 50మంది తమ ఇళ్లను ఖాళీచేసి తాళాలు కూడా వేయడం జరిగింది. మరో 50మంది వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నప్పటికీ కొంత మంది స్వీయప్రయోజనాలతో వారిని అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ ఈ బోజగుట్టలో 450 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిలో కొన్ని నాలుగు అంతస్తులలో స్లాబుల పూర్తి, మరికొన్ని పిల్లర్ల స్థాయిలో ఉన్నాయి. నగర నడిబొడ్డు మెహిదీపట్నం సమీపంలో గుడిమల్కాపూర్ వద్ద 13ఎకరాల విస్తీర్ణంలో వివేకానందనగర్, శ్రీరాంనగర్, శివాజీనగర్ అనే పేర్లతో బస్తీలు ఉన్న ఈ బోజగుట్టలో 1824మంది చిన్నచిన్న గుడిసెలు వేసుకొని ఏవిధమైన మౌలిక సదుపాయాలు లేకుండా నివసిస్తున్నారు. ఈ 1,824మందిలో 1500మందికి పైగా సుమారు పది నుండి 30 గజాల విస్తీర్ణంలో నివసిస్తున్నారు. ఈ బోజగుట్టలో 60గజాలకు పైబడి భూమిని ఆక్రమించుకొని నివసిస్తున్న 24మంది మాత్రమే డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు అడ్డుపడుతున్నారు. వీరివల్ల మిగిలిన వెయ్యి మంది ఇల్ల నిర్మాణాలకు ప్రతి బంధకం గా మారింది. అయితే డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అంగీకరించని 230మందికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి అవసరమైతే వారికి తాత్కాలికంగా జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం ఇళ్లలో వసతి కల్పించడం ద్వారా ఇళ్లను ఖాళీ చేయించి మిగిలిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను వేగంగా నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇందుకు స్వచ్హంద సంస్థల సహకారం తో నిరాకరిస్తున్నా వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం తో పాటు ప్రస్తుతం జాతీయ స్తాయిలొ పలువురిని ఆకర్షిస్తున్న ఐ డి ఎచ్ కాలనీ, సింగమ్ చెరువు తండా డబుల్ బెడ్రూం ఇల్ల ణూ చూపించాలని, తద్వారా వారి మనసు మార్చాలని జీహెచ్హెంసి అడికారులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న మురికివాడల్లో 45 స్లమ్‌ల నివాసితులను కౌన్సిలింగ్ ద్వారా ఖాళీ చేయించి ఆయా బస్తీల్లో పదివేల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించింది. గతంలో మురికివాడలను ఖాళీ చేయించి పక్కా ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని గతంలో ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కౌన్సిలింగ్, లబ్దిదారుల్లో విశ్వాసం కలిగించడం, ప్రామాణికమైన ఉచిత డబుల్ బెడ్‌రూం నిర్మాణాలను చేపట్టే విషయంలో ఇప్పటికే నిర్మించిన ఐడీహెచ్ కాలనీ ద్వారా విశ్వాసం ఏర్పడే తమ మురికివాడల్లో ఉన్న నివాసాలను ఖాళీచేసి డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు అంగీకరించారు.