బైక్ రేసింగ్ లో పట్టుబడ్డ పెద్దింటి పిల్లలు

హైదరాబాద్ , ప్రతినిధి : నగరంలో రోజురోజుకి బైక్ రేసింగ్ లు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రేసింగ్ లు నిర్వహిస్తూ హఢలెత్తిస్తున్నారు. ఈ బైక్ రేసింగ్ లు అరికట్టడానికి పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట రేసింగ్ లు జరుగుతూనే ఉన్నాయి. బాగా డబ్బు ఉన్న పుత్రరత్నాలే అధికంగా రేసులు నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున నెక్లెస్ రోడ్డులో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేశారు. మొత్తం 72 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అధికంగా ఉన్నత వర్గాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా మైనర్లే ఎక్కువగా ఉన్నారని సమాచారం. రేసింగ్ ల వల్ల తీవ్ర భయాందోళనలకు గురవుతున్న వాకర్స్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు సమాచారం.

కఠిన చర్యలు తీసుకుంటాం – డీసీపీ..
వీరందరినీ అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని డీసీపీ పేర్కొన్నారు. వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి మళ్లీ రేసింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా తల్లిదండ్రులకు తెలియకుండా రేసింగ్ లు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.