
బేగంపేట లోని టూరిజం ప్లాజా లో అమెరికా సంయుక్త రాష్ట్రాలనుంచి వచ్చిన ప్రతినిధుల బృందంతో టూరిజం మరియు కల్చరల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, టూరిజం ఎం డి క్రిస్టినా జడ్ చింగ్తూ, మాజీ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర, ప్రభుత్వ సలహాదారులు పాపారావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ఆబివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ చేసారు తెలంగాణ టూరిజం ఆధికారులు . హైదరాబాద్ నగరం ఆంతర్జాతీయ స్థాయి నగరంగా గుర్తింపుకోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై
ఆమెరికా నుంచి వచ్చిన సెయింట్ లూయిస్ ఎకానామిక్ డెవలప్ మెంట్ డైరెక్టర్ కరెణ్ ఎల్లీస్ ,సినియర్ వైస్ ప్రసిడెంట్ జేమ్స్ ఎఫ్ ఆలేక్ జేండర్ , టీ రెక్స్ ప్రసిడేంట్ హెగెన్ పాట్రీసియా లకు వివరించారు. నగరంలో ఉన్న ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న వారసత్వ కట్టడాలైన గోల్కోండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్, చార్మినార్ , రామప్ప గుడి లాంటి వారసత్వ కట్టడాల చరిత్ర ను ప్రతినిధుల బృందానికి వివరించారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రకృతి సిద్దంగా ఉన్న పర్యాటక ప్రదేశాలు, వైల్డ్ లైప్ టూరిజం, ఎకో టూరిజం, బుద్దియిజం ఆభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న
కార్యక్రమాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న చారిత్రక, వారసత్వ కట్టడాల చరిత్ర ను ఆమేరికా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం ఆడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ఆభివృద్దికి ఆపారమైన ఆవకాశాలు ఉన్నాయని, టూరిజం పై పెట్టుబడుల పెట్టేందుకు ఆమేరికా ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసారన్నారు టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం.