
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ఆయన అనుచరులు దక్కించుకున్న పనులు చేయపోయపోతే ఏం చేశాడో తెలుసా.. అధికారి అని చూడకుండా ఇంటికి పిలిపించి వీపు వాచిపోయేలా గల్లపట్టి కొట్టాడట.. ఈయన ఎమ్మెల్యేనా రౌడీ అనేనా మీ ఫీలింగ్ కానీ.. ఎమ్మెల్యే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య .. ఈ ఎమ్మెల్యేపై వరసుగా ఆరోపణలు వస్తున్నాయి.. అప్పట్లో ఓ మహిళ భూమిని కబ్జా చేసి ఆమె సూసైడ్ చేసుకుంది. ఇది దుమారం అయ్యింది. ఈ విషయంలో మన ఎమ్మెల్యే హస్తం ఉందని సమాచారం. ఇప్పుడు ఏకంగా అధికారినే చితకబాదడంతో మనోడు వార్తల్లో నిలిచాడు..
కొ త్తగా ఏఈఈ గా చేరిన దేవేందర్ అనే అధికారి ప్రస్తుతం నెన్నెల మండలం బాధ్యతలు చూస్తున్నారు. ఆ మండలంలో కాంట్రాక్టు పొందిన ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులకు బిల్లులు ఇవ్వడంలో అధికారి జాప్యం చేశాడట.. అంతే ఎమ్మెల్యేగారికి కోపం వచ్చింది. పీఏతో ఫోన్ చేయించాడు. ఇంటికి రప్పించాడు.. మావాళ్ల బిల్లులు ఇవ్వవా అని వంగవెట్టి గుద్దాడట.. దీంతో ఖంగుతున్న సదురు అధికారి బోరున విలపిస్తూ విలేకర్ల వద్ద ఈ విషయం చెప్పాడట..
కొత్తగా వచ్చిన ఏఈఈ తనకు పనుల్లో కొంత అవగాహనలేదు.. అవినీతి జరగడతో బిల్లులు పక్కనపెట్టాడు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చితకబాదారు.
కాగా దీనిపై అధికారులు గుర్రుమంటున్నారు. ఎమ్మెల్యే వైఖరి మండిపడుతున్నారు. త్వరలోనే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. సంఘటితమై ఉద్యమం లేవదీసి చిన్నయ్య పని పడతామంటున్నారు.