బెంగళూరు సౌఖ్య, జిందాల్ ప్రకృతి చికిత్స కేంద్రాలను సందర్శించిన వైద్య మంత్రి లక్ష్మారెడ్డి బృందం

బెంగళూరు సౌఖ్య, జిందాల్ ప్రకృతి చికిత్స కేంద్రాలను సందర్శించిన వైద్య మంత్రి లక్ష్మారెడ్డి బృందం

నేచురోపతితో సహజంగా రోగ నిరోధం

అంబర్ పేట కేంద్రం అప్గ్రేడ్ కి ఆదేశం

త్వరలో వికారాబాద్ లో ఆధునిక ప్రకృతి చికిత్స కేంద్రం

రోగ నిరోధం, నివారణ ల్లో ప్రకృతి చికిత్సను మించిన వైద్యం లేదన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్  సి లక్ష్మారెడ్డి.  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అద్భుత వైద్యం గా మంత్రి అభిప్రాయపడ్డారు. దేశీయ వైద్యంగా పేరున్న ప్రకృతి చికిత్స విధానాలను పరిశీలించడానికి మంత్రి లక్ష్మారెడ్డి, ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఏ రాజేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండి వేణుగోపాల్ రావు తో కలిసి బెంగళూరు వెళ్లారు. అక్కడ మంత్రి బృందం సౌఖ్య, జిందాల్    ప్రకృతి చికిత్స కేంద్రాలను పరిశీలించారు. వివిధ విభాగాల్లో రకరకాల రోగాలకు అందిస్తున్న చికిత్సలను పరిశీలించారు. బెంగళూరు లోని ప్రకృతి చికిత్స వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా వైద్య మంత్రి లక్ష్మారెడ్డి బృందం ముందుగా సౌఖ్య లోని సదుపాయాలను చూశారు. ఆ తర్వాత జిందాల్ ప్రకృతి చికిత్స విధానాలను చూశారు. వివిధ విభాగాలుగా అందుతున్న వైద్య పద్ధతులను చూశారు. అలాగే అక్కడ వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు. అక్కడి పరిపాలన విధానాలు, వైద్య సేవల్లో సాధించిన ప్రగతిని తెలుసుకున్నారు. వాటిని మన తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న వైద్య సేవలతో పోల్చి చూశారు. మన రాష్ట్రంలో కంటే మెరుగైన వైద్య విధానాలను ఇక్కడ అమలులోకి తేవాలని ఆయుష్ కమిషనర్, tsmsidc md వేణుగోపాల్ రావు లను ఆదేశించారు. ం

 

ప్రకృతి చికిత్సలు రోగాలు రాకుండా నిరోధించడంలోనూ, వచ్చిన దీర్ఘకాలిక రోగాల నివారణ లోనూ చాలా కీలకంగా పని చేస్తున్నదన్నారు. ఇలాంటి చికిత్స విధానాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం మంచిదన్నారు.

 

ఇక బేగంపేట లోని ప్రకృతి చికిత్స కేంద్రాన్ని మరింత గా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య సేవలను మెరుగు పరచాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇక వికారాబాద్ లో కొత్తగా ఏర్పాటు చేయడానికి తలపెట్టిన ప్రకృతి చికిత్స కేంద్రం పనులు వేగవంతం చేయాలన్నారు. అక్కడ ప్రకృతి సహజంగా, అత్యంత ఆహ్లాద వాతావరణంలో అనంత గిరి హిల్స్ లో ప్రకృతి చికిత్స కేంద్రం ఏర్పాటు బాగుంటుందన్నారు. అనంతగిరి హిల్స్ లో అత్యాధునిక వసతులతో ప్రకృతి చికిత్స కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *