Breaking News

బుర్రా వెంకటేశం తో టర్కీ దేశ రాయబారి అద్నాన్ సమావేశం

బుర్రా వెంకటేశం తో టర్కీ దేశ రాయబారి అద్నాన్ సమావేశం

తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తో టర్కీ దేశ రాయబారి అద్నాన్ అల్తాయ్ అల్టినోర్స్ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టర్కీ దేశ పర్యాటక, సాంస్కృతి సాంప్రదాయాల పై హైదరాబాద్ లో టర్కీస్ వీక్ గా నిర్వహించటం తోపాటు టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్ లో హైదరాబాద్ వీక్ ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. టర్కీ దేశంతో హైదరాబాద్ నగరానికి గతం నుంచి మంచి స్నేహపూర్వక సంబందాలు ఉన్నాయన్నాయన్నారు . అందులో భాగంగా హైదరాబాద్ , తెలంగాణ ప్రాంత సంస్కృతి మరియు సాంప్రదాయాలను టర్కీ దేశంలో  పరిచయం చేసి పర్యాటకులను ఆకర్షిస్తామన్నారు. టర్కీ దేశానికి చెందిన కొన్ని కంపనీలు మ్యూజీక్ మెట్లు ను తయారు చేస్తున్నాయని వాటిని మన హైదరాబాద్ నగరానికి పరిచయం చేసే విధంగా వారిని ఆహ్వానిస్తూమన్నారు. టర్కీ దేశపు రాయబారి అద్నాన్ అల్తాయ్ కు తెలంగాణ పర్యాటక శాఖ రూపోందించిన పుస్తకాలను ఈ సందర్భంగా  బహూకరించారు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి  బుర్రా వెంకటేశం .

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *