బుధవారం సచివాలయంలో ఆక్వాక్స్ ఇండియా -2018 ను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

బుధవారం సచివాలయంలో ఆక్వాక్స్ ఇండియా -2018 ను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ రాష్ట్రంలో చేపల వృత్తిపై ఆదారపడి జీవిస్తున్న లక్షలాది మత్స్యకారులను సామాజికంగా ఆర్ధికంగా బలోపేతం చేయడానికి అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ను హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసిసిలో మార్చి 15 నుండి 18 వరకు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య శాఖామంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

బుధవారం సచివాలయంలో ఆక్వాక్స్ ఇండియా -2018 (aquaex india-2018) ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ సొసైటీఫర్ ఇండియన్ ఫిషరీస్ ఆక్వా కల్చర్ సంస్ధ సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయంగా అభివృద్ధి పరచిన సాంకేతిక విధానాలు, కొత్త జాతులు వాటిని ఉత్పత్తిచేసే విధానాలు, మంచి యంత్ర సామాగ్రి, నాణ్యమైన ఉత్పత్తులు, ఉత్తమ మార్కెటింగ్ పద్ధతులు, వినియోగదారులకు నాణ్యత పై అవగాహన కల్పించడం, మానవ వనరుల నైపుణ్య అభివృద్ధికి కృషి వంటి అంశాలపై మత్స్యకారులందరికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. దక్షిణ ఆసియా లోనే మొట్టమొదటిసారిగా మత్య్స రంగ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఆక్వాక్స్ ఇండియా-2018 అని మంత్రి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో సుమారు 25 దేశాల నుంచి వివిధ కంపెనీల ప్రతినిధులు,మనదేశంలోని అన్ని రాష్ట్రాల చేపల పెంపకం దారులు, ప్రజలు హాజరు కానున్నారన్నారు. భారత దేశం లో 14.5 మిలియన్ల ప్రజలు ఈ మత్స్య రంగం పై ఆధారపడి జీవిస్తున్నారని, సుమారు 10.8 మిలియన్ టన్నుల చేపలను, రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచ ఉత్పత్తి లో 60 శాతం చైనా చేస్తుండగా రెండోవ స్థానం లో మన దేశం ఉన్నదని ఆయన తెలిపారు.

talasani srinivas yadav

చేపలు,రొయ్యల ఆహారం మనిషి ఆరోగ్యానికి చాల అవసరమని వైద్యులు, నిపుణులు ముక్తకంఠముతో చెబుతున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆలోచనలతో చేపపిల్లల్ని బారి ఎత్తున పెంచడం వలన మత్యరంగం లో మన రాష్ట్రానికి ప్రపంచ స్థాయి లో గుర్తింపు వచ్చిందన్నారు. గతసంవత్సరం 22 కోట్ల చేప పిల్లల్ని, ఈ సంవత్సరం 52 కోట్ల చేప పిల్లల్ని పంపిణి చేసామని, దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. మత్స్య రంగం పై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. సమీకృత మత్స్యాభివృద్ధి పథకం ద్వారా సుమారు 1000 కోట్ల ఖర్చుతో మత్స్య విత్తన అభివృద్ధి, మత్స్య సంపద అభివృద్ధి, చేపల వేట పరికరాలు, మార్కెటింగ్ సదుపాయాలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణ మరియు క్షేత్ర సందర్శన తదితర కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. పశుసంవర్ధక,మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా మాట్లాడుతూ మన రాష్ట్రంలో వాటర్ సోర్స్ ఎక్కువగా ఉన్నందున చేపల పెంపకానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. ఈసారి 1.50 లక్షల రొయ్యలని ప్రయోగాత్మకంగా పెంచడం జరుగుతుందన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా కుంటలు, చెరువులు, రిజర్వాయర్ లలో భారీ ఎత్తున చేపలను పెంచడం జరుగుతుందన్నారు. మత్స్యశాఖ కమీషనర్ శ్రీమతి సువర్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక చర్యలు తీసుకొని అధిక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సు మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీఫర్ ఇండియన్ ఫిషరీస్ ఆక్వా కల్చర్ (SIFA),ప్రెసిడెంట్ శ్రీ రామచంద్రరాజు, సిఈఓ శ్రీ వేణుదంతులూరి, డైరెక్టర్ శ్రీ సమీర్ పాత్ర తదితరులు పాల్గొన్నారు.

talasani srinivas yadav 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *