Breaking News

బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం

Nitheesh kumar

పాట్నా, ప్రతినిధి : బీహార్ ముఖ్యమంత్రిగా ఆదివారం సాయంత్రం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 22 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ త్రిపాఠి వారితో రాజీనామా చేసేవరకు బీహార్ రాజకీయంలో హైడ్రామా నడిచింది. జేడీయూ నేత నితీష్ కుమార్ 4వ సారి బీహార్ సీఎంగా ప్రమాణం చేశారు. మాంజీ రాజీనామా నేపథ్యంలో నితీష్ శనివారం గవర్నర్ ను రాజ్ భవన్ లో కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ త్రిపాఠి ఆయనను ఆహ్వానించారు. బీహార్ ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యల మద్దతు అవసం. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీష్ కుమార్ గవర్నర్ త్రిపాఠికి వెల్లడించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *