
పాట్నా, ప్రతినిధి : బీహార్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. టాటా చాప్రా ఎక్స్ ప్రెస్ లోకి దొంగలు చొరబడి.. కత్తులతో బెదిరించి విలువైన ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన జముయీ జిల్లాలో చోటుచేసుకుంది. 15 మంది దోపిడీ దొంగలు మారణాయుధాలతో అర్ధరాత్రి టాటా చాప్రా ఎక్స్ ప్రెస్ లోని నాలుగు బోగీల్లోకి చొరబడ్డారు. కత్తులతో బెదిరించి ప్రయాణీకులు వద్ద నుంచి విలువైన ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు.
అయితే దొంగలు పారిపోయిన తర్వాత రైల్వే పోలీసులు వచ్చారు. దీంతో ప్రయాణీకులు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. దొంగలు, పోలీసులు కుమ్మక్కు అయ్యారనే అనుమానాలు కలుగుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.