బీహార్ ది.. వరంగల్ లో రిపీట్ అవుద్దా..

wgl

కాంగ్రెస్ పార్టీ జోష్ మీదుంది.. బిహార్ లో బీజేపీ ఓటమి పాలుకావడం.. కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలకు సంతోషం కలిగిస్తోంది.. సీపీఐ, సీపీఎం సీతారాం ఏచూరి కూడా నిన్న బీజేపీ ఓటమి అనంతరం దేశంలో అచ్చేదిన్ బీజేపీ ఓటమితో స్టార్ట్ అయ్యిందంటూ వ్యాఖ్యానించడం.. బీజేపీపై నెలకొన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనం..

మోడీ దేశ ప్రధాని అయితే ఏదో చేసేస్తాడని జనం ఆశించారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తానన్నాడు. అనక విదేశీ టూర్లతో, కడుపునింపని మాటలతో కాలం వెల్లదీశాడు. ఇవే కాక స్ర్తీ శిశుసంక్షేమ పథకాలను రద్దు చేశాడు, మోడల్ స్కూల్స్ వ్యవస్థలను ఎత్తివేశాడు. దీని వల్ల రాష్ట్రప్రభుత్వాలపై తీవ్ర భారం పడింది. దీంతో ప్రజలు కేంద్రం తీరుపై గుర్రుగా ఉన్నారు. మోడీ అమలు చేసిన పథకాలేవీ.. సామాన్యుడికి ప్రత్యక్ష్యంగా లబ్ధి చేకూర్చేవిగా లేవని ప్రజలు భావిస్తున్నారు. ఇవే కాదు.. ఇటీవల ధరల పెరుగుదల మోడీకి బాగా మైనస్ అయ్యింది. కందిపప్పు ధర భాగా పెరగడం బీహార్ ఎన్నికలపై ప్రభావం చూపి ఓటమి పాలయ్యేలా చేసింది.

అందుకే మోడీ పై తీవ్ర వ్యతిరేకతో బీహార్ లో ఓడించారు జనాలు.. ఈ ఓటమి వరంగల్ ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని.. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీని, ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న టీఆర్ఎస్ ను జనం ఓడిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీ ఓటమి తమకు కలిసొస్తుందంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *