బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి : మంత్రి జోగు రామన్న

బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి మెరికెల్లాంటి విద్యార్థులుగా తీర్చిదిద్దాలి వచ్చే విద్యా సంవత్సరం నుంచి 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం ప్రవేశాల కోసం విస్తృతంగా ప్రచారం చేయాలి పక్కా భవనాల నిర్మాణాల వరకు తాత్కాలికంగా అద్దె భవనాల్లో తరగతులు కల్యాణలక్ష్మీపథకాన్ని పక్కాగా అమలు చేయాలి ధోబీఘాట్స్ నిర్మాణాల కోసం చర్యలు తీసుకోవాలి రజకులకు అత్యాధునిక వాషింగ్ మెషిన్ల కోసం ప్రణాళిక

జిల్లా బీసీ అధికారులతో మంత్రి జోగు రామన్నవీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 17 : రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొపున మంజూరు చేసిన జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని, అందులో ప్రవేశాల కోసం విస్తృతంగా ప్రచారాన్ని కల్పించాలని బీసీ సంక్షేమం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని సీ బ్లాక్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారులతో మంత్రి జోగు రామన్న వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలన్నారు. బీసీ విద్యార్థులను మెరికెల్లా తీర్చిదిద్దాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధనను ప్రారంభించాలని, పక్కా భవనాలు నిర్మాణం అయ్యే వరకు తాత్కాలికంగా అద్దె భవనాల్లో తరగతులను ప్రారంభించాలని మంత్రి జోగు రామన్న సూచించారు. హాస్టల్స్ లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటే దానికి దగ్గరలో ఉన్న మరో హాస్టల్స్లోకి వారికి తరలించాలన్నారు. కల్యాణలక్ష్మీ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని, ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. బీసీలకు ప్రభుత్వం అందచేస్తున్న ఉపాధి కల్పన వంటి పథకాలకు రుణాలు సకాలంలో అందే విధంగా బ్యాంకర్స్ తో సమావేశాలను నిర్వహించాలని ఆయన సూచించారు. ధోబీఘాట్స్ నిర్మాణాల కోసం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రజకులకు అత్యాధునిక వాషింగ్ మెషిన్లు అందించేందుకు కార్యాచరణను రూపొందించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్, కమిషనర్ అరుణ, ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ సైదా, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, జేడీ అలోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఎకో టూరిజం అభివృద్ధి కోసం ప్రణాళికలు

మంత్రి జోగు రామన్న

రాష్ట్రం లో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అటవీ, పర్యావరణం,బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్లో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ఎఫ్ డీసీ కార్యక్రమాలను మంత్రి జోగు రామన్న సమీక్షించారు. తెలంగాణలో ఎకో టూరిజం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందన్నారు. ఎకో టూరిజంలో తెలంగాణ దేశంలో మెరుగైన స్థానంలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) ద్వారా యూకలిప్టస్ మొక్కలు విరివిగా పెంచాలని, అందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే కాత దశకు వచ్చిన యూకలిప్టస్ చెట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే జూలై నుంచి ప్రారంభం కానున్న మూడో విడత హరితహారం కార్యక్రమం కోసం 4,219 నర్సరీలలో విరివిగా మొక్కలను పెంచుతున్నామని ఆయన తెలిపారు. ప్రజలు కోరుకున్న మొక్కలను అందజేసేందుకు పక్కాగా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతోపాటు వివిధ రకాల మొక్కలను నర్సరీలలో పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ హరిత రక్షణ కమిటీలను విశ్వాసంలోకి తీసుకుని అధికారులు ముందుకు సాగాలని మంత్రి జోగు రామన్న సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ.ఆర్మీనా, ఎఫ్డీసీ ఎండీ చందన్ మిత్రా, తదితరులు పాల్గొన్నారు.

jogu ramana video confidence

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *