బీసీ కాబట్టే మంత్రి పదవి ఇవ్వలేదు..

-అగ్రవర్ణ నేతల వల్లే పదవి రాలేదు..
-పూలే జయంతి సభలో శ్రీనివాస్ గౌడ్ ఆవేదన
హైదరాబాద్ : శనివారం నిర్వహించిన ఫూలే జయంతి సభలో పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస గౌడ్ బాంబు పేల్చారు. తాను బీసీ కావడం వల్లే మంత్రి పదవి రాలేదని.. లోలోపల రగులుతున్న జ్వాలను వెదజల్లారు. అగ్రవర్ణాల నేతల వల్లే తనకు మంత్రి పదవి రాలేదని నిట్టూర్చారు. ఉద్యమంలో పోరాడిన వాళ్లకు కాకుండా కేవలం కులం, హోదా, పలుకుబడి, డబ్బును బట్టి తెలంగాణ కోసం పోరాడకుండా ఉన్న వారికి సైతం మంత్రి పదవులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకనొక దశలో బీసీగా పుట్టడమే నేను చేసిన శాపమా అని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో ఈ పరిస్థితి ముదురుతోంది. ఉద్యమకారులను కేసీఆర్ పక్కనపెడుతున్నారన్న నింద పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు బయటపడిందని నాయకులు గుసగుసలాడుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *