బీసీల అభ్యున్న‌తి కోసం చిత్త‌శుద్ధితో కృషి

బీసీల అభ్యున్న‌తి కోసం చిత్త‌శుద్ధితో కృషి
అన్ని రంగాల్లో బీసీల‌కు పెద్ద‌పీట‌
ఆచార్య కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఆశ‌యాల‌ను సాధిస్తాం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న‌
బాపూజీ 102వ జ‌యంతి వాల్ పోస్ట‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌
హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 26 : బీసీల అభ్యున్న‌తి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో కృషి చేస్తోంద‌ని బీసీ సంక్షేమ శా మంత్రి జోగు రామ‌న్న అన్నారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో ఆచార్య కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 102వ జ‌యంతి వాల్ పోస్ట‌ర్ల‌ను అసెంబ్లీ బీసీ క‌మిటీ చైర్మ‌న్ వీజీ గౌడ్‌, ఎంబీసీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ తాడూరి శ్రీ‌నివాస్‌ల‌తో క‌లిసి మంత్రి జోగు రామ‌న్న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా జోగు రామ‌న్న మాట్లాడుతూ బీసీల‌కు అన్ని రంగాల్లో పెద్ద‌పీట వేస్తున్న‌ట్లు తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వ హ‌యాంలో బీసీల కోసం అనేక ప‌థ‌కాల‌ను ర‌చించి అమ‌లు చేస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు. తెలంగాణ కోసం ఆచార్య కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అహ‌ర్నిశ‌లు కృషి చేశార‌ని గుర్తు చేశారు. బాపూజీ ఆశ‌యాల‌ను సాధించే మార్గంలో ప‌య‌నిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. బాపూజీ 102వ‌ జ‌యంతి బుధ‌వారం ప‌బ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియ‌ద‌ర్శిని హాల్‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు అధికారికంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని జోగు రామ‌న్న పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో అసెంబ్లీ బీసీ క‌మిటీ చైర్మ‌న్ వీజీ గౌడ్‌, ఎంబీసీ కార్పొరేష‌న్‌ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ విజ‌య్‌కుమార్‌, అద‌న‌పు కార్య‌ద‌ర్శి సైదా, బాపూజీ 102వ జ‌యంతి ఆహ్వాన క‌మిటీ వైస్ చైర్మ‌న్లు గోషిక యాద‌గిరి, ఎస్‌.దుర్గ‌య్య గౌడ్‌, భాగ్య‌ల‌క్ష్మీ, స‌ల‌హాదారులు గుజ్జ కృష్ణ‌, జాజుల శ్రీ‌నివాస్‌గౌడ్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *