బీసీలకు కళ్యాణ లక్ష్మీ

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుడుతోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు సైతం కళ్యాణ లక్ష్మీని వర్తింపచేసేందుకు సమాయత్తమవుతోంది.. ఈ ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ, బీసీలందరికీ కళ్యాణ లక్ష్మీని అమలు చేస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న తెలిపారు.

అన్ని వర్గాలకు కళ్యాణ లక్ష్మీ వర్తింపచేయాలని సీఎం కేసీఆర్ కోరిక మేరకు  ఈ పథకాన్ని బీసీలకు వర్తింప చేస్తున్నామని ఆయన అన్నారు.

కాగా ఈ పథకంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరింత ప్రజాభిమానం కలుగనుంది. ఎస్సీ, ఎస్టీలతో బీసీలకు వర్తింపచేస్తే ఇక అందరూ ప్రయోజనం పొందినవారవుతారు. దీంతో మరోసారి ఎన్నికల వేల ఇది టీఆర్ఎస్ కొండంత బలాన్నిస్తుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *