
హైదరాబాద్ : ఇళ్లలో పాచిపనే యువతి(18)ని నిన్న రాత్రి వరుసకు బావయ్య ఉస్మాన్ (36), అతని స్నేహితుడు పీయూష్ (28) కలిసి అత్యాచారం చేశారు. యువతికి ఫుల్లుగా బీరు తాగించి హైదరాబాద్ లోయర్ ట్యాంకు బండ్ సమీపంలోని డీబీఆర్ మిల్లులోకి తీసుకెళ్లి ఇద్దరు అత్యాచారం చేశారు. అనంతరం యువతిని గాంధీనగర్ లోని పుట్ పాత్ పై వదిలి పారిపోయారు.
తన అక్క ఇంటికి బయలు దేరిన యువతిని మాయమాటలు చెప్పి ఉస్మాన్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంధువులు ఆమె కోసం వెతకగా దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందుతులు ఉస్మాన్, పీయూష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.