బీబీ ఛీ !!

BBC

గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయను మరోసారి అవమానించడానికి బీబీసీ కంకంణం కట్టుకుంది. ఇండియాస్ డాటర్ పేరుతో తీసిన డాక్యుమెంటరీలో రేపిస్టు ఇంటర్ వ్యూ కూడా ఉంది. ఆ రేపిస్టు చేసిన వ్యాఖ్యలు నిర్భయను మహిళలను దారుణంగా కించపరిచేలా ఉన్నాయి. దీని ప్రసారంపై ఢిల్లీ కోర్టు నిషేధం విధించింది.

అయినా బీబీసీకి బుద్ధి రాలేదు. గురువారం రాత్రి ఈ డాక్యుమెంటరీని యూకేలో ప్రసారం చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా బీబీసీ ప్రసారాన్ని ఆపే అవకాశం కనిపించడం లేదు. డిసెంబర్ 16 నాటి దారుణ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది.

అంతటి నీచమైన నేరం చేసిన వాడిని ఏదో హీరోలా జైలుకు పోయి మరీ ఇంటర్ వ్యూ చేయడం, ఎన్ని విమర్శలు వచ్చినా ప్రసారం చేస్తామని మొండి పట్టు పట్టడం బీబీసీకే చెల్లింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు ఎంతో మంచి పేరుంది. అలాంటి చానల్ ఇంతర నీచంగా ప్రవర్తించడమే ఆశ్చర్యకరం.

ఇప్పటికే చాలా మంది మెయిల్స్, ఫేస్ బుక్, ట్విటర్ కామెంట్ల ద్వారా నిరసన తెలుపుతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నిరసనలు చూసైనా బీబీసీ నిర్ణయం మారుతుందని ఆశిస్తున్నారు. అందరూ ఈ నిరసనలో పాల్గొనాలని ముఖ్యంగా యువతరం పిలుపునిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *