Breaking News

బీఫ్ ఫెస్టివెల్ తో రగులుతున్న ‘ఉస్మానియా’

beef festival(1)

ఉస్మానియా మరో రణరంగానికి వేదికైంది. విద్యార్థుల పరస్పర విరుద్ధ మతచాంధసవాద చేష్టలతో అట్టుడుకుతోంది.. కొందరు మాదిగ సామాజిక వర్గ విద్యార్థులు కూటమిగా ఏర్పడి గొడ్డు మాంసం( గో మాసం) ఫెస్టివల్ ను నిర్వహించడానికి ప్లాన్ చేశారు. తేదీ కూడా అనౌన్స్ చేశారు. దీంతో ఉస్మానియాలో సెగలు పుట్టాయి..

గో మాంసం (బీఫ్ ఫెస్టివెల్) కు వ్యతిరేకంగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు, వీహెచ్పీ ,హిందుత్వ సంఘం కింద ఉస్మానియా విద్యార్థులు ఏకమయ్యారు. వీరికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తోడై ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివెల్ ను నిర్వహించడానికి ఒప్పుకోమని దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

హిందువులు దైవంగా పూజించే గోవులను చంపి చేసే బీఫ్ ఫెస్టివెల్ చేస్తే దారుణ చర్యలుంటాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాదిగ విద్యార్థులను హెచ్చరించారు. కానీ మాదిగ విద్యార్థులు ఇది మా ఆహారం.. అనాదిగా తింటున్నాం.. మీరెవరు ఆపడానికంటూ ఫెస్టివెల్ ను చేయడానికి పూనుకున్నారు.

ఇరుపక్షాలు దాడులు, ప్రతిదాడులకు వ్యూహాలు పన్నడంతో బీఫ్ పెస్టివెల్ పై ప్రభుత్వం అలర్ట్ అయ్యి పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బీఫ్ ఫెస్టివెల్ ఉస్మానియాలో నిర్వహించడానికి వీలు లేదని.. మీ ఇళ్లలో, ఫంక్షన్ హాల్లలో పెట్టుకుంటే అభ్యంతరం లేదని.. విద్యార్థులు చదువులుపై దృష్టి పెట్టాలని.. వివాదాలపై కాదని సూచించారు.

డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో మళ్లీ వివాదం ముదిరిపాకానపడింది.. బీఫ్ మాంసం అంటూ కొత్త వివాదం ఇప్పుడు ఉస్మానియాను, బీజేపీ, హిందూ వాదులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి తీసుకెళ్లింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *