బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నాడు..

-nitish-modi-

దేశంలో మరో కొత్త సమీకరణానికి నాంది పడుతోంది. బీహార్ సీఎంగా గెలిచిన నితీష్ కుమార్ దీనికి అంకుర్పారణ చేస్తున్నారు.ఈ నెల 20 బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ వ్యతిరేక శక్తులను సీఎం నితీష్ ఆహ్వానించనున్నారట.. ఇదే విషయాన్ని జేడీయూ అధికార ప్రతినిధి పాట్నాలో చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అద్యక్షులు శరద్ యాదవ్ లు కార్యక్రమానికి ముఖ్య అతిథులని తెలిపారు.

బీజేపీకి వ్యతిరేకంగానే నితీష్ ఈ కార్యక్రమానికి బీజేపీకి బద్ద వ్యతిరేకులైన పశ్చిమబెంగాల్ సీఎం మమత, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, అస్సాం సీఎం తరుణ్ గోగోయ్, మాజీ ప్రధాని దేవెగౌడ, జార్ఖండ్ మాజీ సీఎం మరాండీ తదితర బీజేపీ వ్యతిరేకులకే నితీష్ అహ్వానం పంపారట..

వీరంతా ఒక్కతాటికిపై చేర్చి వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీని ఓడగొట్టాలని ప్రతిన బూననున్నాయి. వారి లక్ష్యం ప్రకారం బీజేపీ వ్యతిరేక శక్తులకు నితీష్ నాయకుడవుతాడు. దీంతో వచ్చే మోడికి పోటీ నితీష్ ప్రధాని బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *