
గుంటూరు : వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం బుధవారం చేపట్టిన దీక్ష ఇవాళ రెండోరోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద జగన్ నిరవధిక దీక్ష ప్రారంభించి ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.
బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని లబ్ధి పొంది రాష్ట్రాన్ని ముంచేశారని జగన్ ఆరోపించారు. ఓట్లు వేయించుకొని ఇఫ్పుడు రాష్ట్రాన్ని అనాథలా వదిలేశారని జగన్ మండిపడ్డారు.