బీజేపీ కోటీశ్వరుల పార్టీ: జైపాల్ రెడ్డి

jaipal reddy

ఆదిలాబాద్ : బీజేపీ కోటీశ్వరులు, బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు మేలు చేసే పార్టీ అని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా కోరిటికల్ లో రాహుల్ పాదయాత్ర వడ్యాల్ లో ముగిసింది.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైపాల్ రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ పేదల భూములను లాక్కొని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టాలని చూస్తోందని.. పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని కోరారు. చంద్రబాబు కూడా వ్యవసాయం దండగ అన్నారని.. అప్పట్లో చంద్రబాబుకు పట్టిన గతే బీజేపీ నరేంద్రమోడీకి పడుతుందని మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *