బీజేపీ ఓటమిబాట ఈయనకు తెగ సంబరమైతందట..

1376398698_modi-babu

చంద్రబాబు .. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్నే శాసించిన నేత.. రాష్ట్రపతి అబ్దుల్ కలాంనే నియమించినటువంటి చంద్రబాబు ప్రస్తుతం ఏపీ సీఎంగా కనీసం తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా సాధించడం లేదు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా.. మోడీయే.

రాజకీయాల్లో చంద్రబాబు ముందు మోడీ చాలా జూనియర్.. కానీ దశ తిరిగి ప్రధాని అయ్యాడు. ఇప్పుడు అందరి నెత్తి మీద కూర్చున్నాడు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చి మరీ మాట తప్పిన మోడిపై లోలోపల చంద్రబాబు రగిలిపోతున్నాడు. తనకు టైం వస్తది మోడీని ఆడిద్దామని వెయిట్ చేస్తున్నాడు..

ఇప్పుడు టైం రానే వచ్చింది.. మోడీ బీజేపీ బీహార్ ఎన్నికల్లో నితీష్ చేతి లో ఓటమి ఖాయమని సర్వేలు తేల్చిచెప్పాయి. దీంతో కమల దళం నిరాశ నెలకొంది. అదే సమయంలో మోడీ నేలకు దిగే సమయం వచ్చిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కాగా బీజేపీ బీహార్ ఓటమిబాట ఆ పార్టీ మిత్రపక్షమైన చంద్రబాబు టీడీపీ నాయకులకు తెగ సంబరపడిపోతున్నారట.. ఏకపక్షంతో ఏపీకి అన్యాయం చేసిన మోడీకి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కాళ్లు పట్టుకునే పరిస్థితి ఇలానే రావాలని వారు కోరుకుంటున్నారట..

మొత్తానికి మోడీకి దేశప్రజలు మంచి తీర్పే ఇస్తున్నారు. ఇలా అయిన ఆయన తన హామీలు నెరవేరిస్తే బాగుంటుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *