Breaking News

బీజేపీలో కుదుపు

Former MLA Yennam Srinivas

మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నాయకుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.

2014 ఎన్నికల్లో యెన్నం బీజీపీ తరఫున మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇవాళ ఆకస్మాత్తు బీజేపీ వైఖరి నచ్చక రాజీనామా చేశారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యామ్మాయాలు కాలేవన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారు ఇంకా చాలామంది కేసుల నుంచి విముక్తి కాలేదని.. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *