
-ఏకమైన దేశంలోని ప్రతిపక్షపార్టీలు
-కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా నేతృత్వం
హైదరాబాద్, ప్రతినిధి : సంపన్నుల కోసమే కేంద్రం ప్రభుత్వం భూసేకరణ బిల్లు తీసుకొస్తుందంటూ ప్రతిపక్షాలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వంపై తొలిసారిగా 14 పార్టీలు చేతులు కలిపి నిరసనస్వరం వినిపించాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో 100మందికిపైగా ఎంపీలు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. భూ సేకరణ చట్టంలో మార్పులకు అంగీకరించేది లేదంటూ నినదించారు. చట్టంలో మార్పులకు ఉద్దేశించిన బిల్లును ఉపసంహరించేవరకు పోరాటం చేస్తామని హెచ్చిరించారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఇలా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై రావడం.. మోడీ ప్రభుత్వంపై యుద్ధానికి దిగడం ఇదే తొలిసారి. మోడీ ప్రభుత్వం ఇలా దుందుడుకుగా ముందుకు వెళితే బిల్లులను ఇలాగే అడ్డుకుంటామని.. ప్రజలకు మేలు చేసేలా చట్టాలు చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.