Breaking News

బీజేపీని బద్నాం చేయడానికి రాహుల్ బాగానే ప్రయత్నిస్తున్నారు..

Narendra-Modi-and-Rahul-Gan

హైదరాబాద్ హెచ్సీయూ విద్యార్థి రాహుల్ ఆత్మహత్యను కాంగ్రెస్ వీలైనంత వాడుకుంటోంది. బీజేపీపై మత ముద్ర వేసేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. అందుకే రెండోసారి హైదరాబాద్ వచ్చి ఇటీవల రాహుల్ మృతి పై ఆమె తల్లి చేస్తున్న దీక్షలో పాల్గొన్నారు.  ఈ దీక్షకు రాహుల్ వచ్చి  ఉద్యమాన్ని రెట్టింపు చేశాడు. విద్యార్థుల దీక్షకు సానుభూతి తెలిపి రాహుల్ సైతం దీక్షలో పాల్గొనడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రత్యేక విమానంలో వచ్చి మరీ దీక్ష కొనసాగించి బీజేపీపై దుమ్మెత్తి పోశాడు. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరుగా తయారైంది.. బీజేపీని టార్గెట్ చేసే రాహుల్ ఇదంతా చేస్తున్నాడని కేంద్ర మంత్రి వెంకయ్య విమర్శించారు. మతతత్వ పార్టీ రాహుల్ పోరుబాట నేపథ్యంలోనే బీజేపీపై విమర్శలు రాకుండా కేంద్రం ఇలాంటి చర్యలు చేపట్టింది..

ఇదంతా కూడా బీజేపీపై మత ముద్ర వేసేందుకు చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది.. దీనిపై బీజేపీ కూడా తీవ్ర తర్జన భర్జనలు పడుతోంది. ఇప్పటికైనా తమపై పడుతున్న ముద్రలను తొలిగించకపోతే కాంగ్రెస్ ముందు వచ్చే ఎన్నికల నాటి ఓటమి తప్పదని భావిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *