బీజేపీని ఓడించేందుకు కలిసిన ఆరుగురు ఉద్దండులు

ఢిల్లీ : దేశ చరిత్రను మలుపు తిప్పిన మోడీని, బీజేపీిని ఎదుర్కొనేందుకు ఆరు అగ్ర రాజకీయ నేతలు ఒక్కటయ్యారు. జనతా పరివార్ పేరుతో ఏర్పాటైన ఈ కొత్త నేషనల్ పార్టీల కూటమికి  సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ నేతృత్వం వహిస్తున్నారు.  ఇందులో ములాయంతోపాటు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), జనతాదళ్ (యు), భారత జాతీయ లోక్ దళ్((ఐ.ఎన్.ఎల్.డి), జనతాదళ్ (సామ్యవాద),సమాజ్ వాదీ జనతా పార్టీ(ఎస్.జె.పి)లు ఏకతాటిపైకి వచ్చాయి.

THIRD FRONT MEETING

ఈ పార్టీల నాయకులంతా ములాయం నేతృత్వంలో ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 2 దశాబ్దాల అనంతరం ఇలా రాజకీయా పార్టీల నేతలు ఒక్కటవడం విశేషం. నరేంద్ర మోడీ లాంటి బలమైన నేతను ఢీకొట్టాలంటే ఏకమవడం ఒక్కటే మార్గమని వారంతా అన్నారు. బీజేపీ ఓటమే ధ్యేయంగా అంతా కలిసి పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది జరుగనున్న బీహార్ ఎన్నికల నుంచి కూటమి కలిసి పనిచేయాలనుకున్నట్టు వారు చెప్పార.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *