Breaking News

బీజేపీని ఆగం చేస్తున్న నాగం

NAGAM_JANARD

బీజేపీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి సొంత ఎజెండాతో వెళుతుండడంతో బీజేపీకి చిక్కులు తెస్తోంది.. నాగం జనార్ధన్ రెడ్డి సొంతంగా తెలంగాణ కోసం ఓ సంస్థను స్థాపించి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాలు స్పందించడం లేదంటూ ఓ సంస్థను స్థాపించి ప్రభుత్వంపై సమర శంఖం పూరించారు.

ఈ పరిణామాలు బీజేపీలో చిచ్చు రేపాయి. బీజేపీలో ఉంటూ అధిష్టానానికి ఏమీ చెప్పకుండా సొంతం సంస్థను ఏర్పాటు చేయడం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గుర్రుగా ఉన్నారట.. రేపో మాపో ఆయనకు నోటీసులు పంపాలని నిర్ణయించుకున్నాడట.. పార్టీకి చెప్పకుండా సొంత వ్యవహారాలపై బీజేపీ నేతలు ఆయనను సస్పెండ్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారట.. కానీ నాగం ఇవేమీ పట్టించుకోకుండా సొంతంగా ముందుకెళ్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *