Breaking News

బీజేపీకి ముందుంది ముసళ్ల పండుగే..

Modi_AmitShah_519617532

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముందున్నాయి.. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి ముందుంది ముసళ్ల పండుగ.. బీజేపీ ఉత్తరభారతానికే పరిమితమైంది. దక్షిణాదిలో దాని పప్పులుడక లేదు.. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే హవా.. ఇక్కడ జాతీయ పార్టీలు మనుగడ సాధించలేవు. తమిళనాడులు జయలలిత, కేరళలో సీపీఐ/కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రాలో టీడీపీ ఇలా ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది..కాగా ఎన్నికల కమిషన్ తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఎన్నికలకు నగరా మోగించింది. ఈ అన్ని రాష్ట్రాల్లో అసలు దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి బలం లేదని చెప్పాలి. ఇక్కడ గెలవడం బీజేపీకి కష్టమే.. ఎందుకంటే తమిళనాట డీఎంకే (కరుణానిధి), అన్నాడీఎంకే(జయలలిత)లకే పీఠం కట్టబెడుతున్నారు ఆ రాష్ట్ర ప్రజలు.. ఇక పశ్చిమ బెంగాల్లో దీదీ మమతా బెనర్జీ దెబ్బతో ప్రతిపక్షం సీపీఎం తుడుచుపెట్టుకుపోయింది. కాంగ్రెస్, బీజేపీ సోదిలోనే లేకుండా పోయాయి. పుదుచ్చేరిలో తమిళపార్టీలదే హవా.. ఇక అస్సాం కాంగ్రెస్ ఏలుబడిలో ఉంది. ఇక్కడ బీజేపీ సైతం బలంగా ఉన్నా గెలిచే అవకాశాలు సగంసగమే.. ప్రాంతీయ పార్టీలదే గెలుపు అని తేలింది. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెచ్చరిల్లాయి. అక్కడ మళ్లీ సీపీఐ గెలుస్తుందని సర్వేల్లో చెప్పాయి.

మొత్తానికి బీజేపీకి రానున్న ఎన్నికలు  ఓ పరీక్షే.. ఇవన్నీ పరిణామాలు బీజేపీకి మింగుడు పడని అంశంగా ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో గెలవడం కాదు కాదా.. అసలు పోటీలో నిలబడడమే కానకష్టంగా ఉంది. చూడాలి మోడీ-అమిత్ షాల ద్వయం ఏం చేస్తుందో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *