బిషన్ సింగ్ బేడీ తర్వాత మన అశ్వినే..

ashwin1_3112getty_750

ఆల్ రౌండర్, బౌలర్ కేటగిరిలో ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంకుతో 2015 సంవత్సరాన్ని ముగించిన భారత ప్రధాన స్పిన్ బౌలర్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.. 1973 లో బిషన్ సింగ్ బేడీ తర్వాత టెస్టుల్లో నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్న బౌలర్ గా ఘనత దక్కించుకున్నాడు. బౌలర్ గానే కాదు.. అల్ రౌండర్ కేటగిరిలో కూడా ఐసీసీ ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్ గా అశ్విన్ ను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి..

కొంత కాలంగా అశ్విన్.. టెస్టుల్లో, వన్డేల్లో భారత ప్రధాన బౌలర్ గా కొనసాగుతున్నారు.. అంతకుముందు ఆల్ రౌండర్ కేటగిరిలో మొదటి ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ షకిబ్ అల్ హాసన్ ను వెనక్కి నెట్టి అశ్విన్ మొదటిర్యాంకులోకి చేరాడు. అంతేకాదు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో విశేషంగా రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. దీంతో అశ్విన్ ను ప్రపంచ నంబర్ 1 బౌలర్ గా ఐసీసీ ప్రకటించింది. ఇది 2015 పూర్తి సంవత్సర ముగింపు సమయంలో అశ్విన్ నంబర్ 1 గా ఉండడంతో అతడి కీర్తి విశ్వవ్యాప్తం అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *