
అతడో బిచ్చగాడు.. ఊరు అనంతపురం.. అనంతపురంలో తీవ్ర కరువుతో కేరళ వలసపోయాడు. అక్కడ పనేది దొరకక బిచ్చగాడిగా మారాడు. వచ్చిన కాసిన్ని డబ్బులతో లాటరీలు కొన్నాడు.. ఆ తరువాత కొన్నాళ్లకు ఒక లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది.
ఒక్క లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది. ఏకంగా లక్షాధికారిని చేసింది. 65 లక్షల లాటరీ తగలడంతో ఆ బిచ్చగాడి ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. పిల్లల్ని బాగా చదవిస్తానని.. ఇక ఇల్లు కొనుక్కుంటానని చెపుతున్నాడు. బిచ్చగాడి వృత్తి మానేస్తావా అని విలేకరులు ప్రశ్నిస్తే దానితోనే కదా తాను లక్షాధికారి అయ్యింది.. అంటూ అసంపూర్తిగా ముగించాడు.