
బాహుబలి మొదటి పార్ట్ బిగ్గేస్ట్ హిట్ కావడంతో బాహుబలి2 సినిమా మరింత లేట్ కానుంది.. ఎందుకంటే బాహుబలి మొదటి పార్ట్ సినిమా వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివెల్స్ లో ప్రదర్శితమవుతోంది. దర్శకుడు రాజమౌళి అయా దేశాల్లో పాల్గొంటూ సినిమా ఇంటర్వ్యూలు, విశేషాలు విదేశీ మీడియాకు వివరిస్తున్నారు. అంతే కాదు చైనాలో కూడా ప్రమోషన్ వర్క్ లో పాల్గొన్నారు. అక్కడ సినిమా 5వేల థియేటర్లలో విడుదలవుతోంది..
అందుకే రాజమౌళి బాహుబలి 2 పార్ట్ లోకి ఇంకా పాల్గొనడం లేదు. కనీసం కథా చర్చలు కూడా ఆయన తండ్రి , రచయిత విజయేంద్రప్రసాద్ తో మాట్లాడడం లేదట.. డిసెంబర్ లో గానీ సినిమా బాహుబలి2 మొదలయ్యే అవకాశం లేదు..