
బాహుబలి 2 పార్ట్ కు దాదాపు 300 కోట్ల ఆఫర్ వచ్చిందట.. బాహుబలి మొదటిపార్ట్ విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.. దాదాపు 500కోట్లకు పైగానే సినిమా వసూలు చేసిందని టాక్.. దీంతో సెకండ్ పార్ట్ రిలీజ్ కు ముందే మార్కెట్ అయిపోతోందట..
ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కోసం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు గాను దాదాపు 300 కోట్ల ఆఫర్ ను ఇచ్చిందట ఓ బడా బాలీవుడ్ కార్పొరేట్ సంస్థ.. కానీ సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ ఫేమస్ అయిన శ్రీ దేవిని శివగామి పాత్రలో పెడితే మార్కెట్ పెరుగుతుందని సలహా కూడా ఇచ్చిందట.. సో ఇప్పుడు దీనిపై చర్చ నడుస్తోంది. కానీ 40శాతం సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో రాజమౌళి మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇక 300 కోట్లపై అప్పటి సినిమా హైప్ ను బట్టి నిర్ణయిస్తానని చెప్పారట..