బాహుబలి మళ్లీ వాయిదా

హైదరాబాద్ : బాహుబలి సినిమా విడుదల వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ డిలే కారణంగా సినిమా వాయిదా పడుతూనే ఉంది. ఈ సినిమా కోసం 600మంది టెక్నిషియన్లు పనిచేస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఈ సినిమాను జూలైలో విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు. యావత్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను రాజమౌళి మే 1 రిలీజ్ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

చిత్రాన్ని జైలై లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. మే 1 నుంచి చిత్రంలోని ప్రధాన పాత్రల పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *