
-మే 15న బాహుబలి రిలీజ్
మూడు సంవత్సరాలుగా తెగ కష్టపడుతూ రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి ఫస్ట్ పార్ట్ చిత్రం షూటింగ్ ఎట్టకేలకు నిన్నటి పూర్తయింది. మిగిలియున్న ఒక్క పాటను నిన్నటి తో పూర్తి చేశామని దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాదు సాంగ్ పూర్తయిన తర్వాత హీరో ప్రభాస్, హీరోయిన్ తమన్నా , సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ పెట్టారు రాజమౌళి.
మొత్తానికి ప్రేక్షకులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న బాహుబలి ఫస్ట్ పార్ట్ పూర్తయ్యింది. వచ్చే మే 15న సినిమా ను రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు.