
దేశంలోనే భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం దెబ్బకు ఏ సినిమా పోటీలో నిలవడం లేదు. ఇన్నాళ్లు జూన్ 6న మహేశ్ బాబు చిత్రం శ్రీమంతుడు రిలీజ్ చేస్తామని ప్రకటించిన నిర్మాతలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
మహేశ్ బర్త్ డే ను పురస్కరించుకొని ఆగస్టు 7న ‘శ్రీమంతుడు’ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. బాహుబలితో పోటీ పెట్టుకుంటే నిలవలేమనే ఉద్దేశంతోనే నెల తర్వాత సినిమాను రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు.