Breaking News

బాహుబలి టికెట్ల జాతర షురూ..

multiflex

భారత దేశ చరిత్రలోనే తొలి హిస్టారికల్ మూవీగా ప్రసిద్ధి కెక్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాహుబలి మూవీ ఈనెల 10న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగా మూవీ తొలి షో ను చూడడానికి జనం ఎగబడుతున్నారు. థియేటర్లు, మల్టిప్లెక్స్ ముందు క్యూ కడుతున్నారు. థియేటర్ల ను దాటి రోడ్ల మీదకు కూడా క్యూ సాగిపోతోంది. దీంతో బాహుబలి విడుదలవుతున్న థియేటర్లలో జాతర జరుగుతున్నట్టు కనపడుతోంది..

కరీంనగర్ మల్టిపెక్స్ లో టికెట్ల కోసం బారులు తీరిన జనం

కరీంనగర్ మల్టిపెక్స్ లో టికెట్ల కోసం బారులు తీరిన జనం

తెలంగాణ, ఏపీ ల్లోని అన్ని థియేటర్లలో ఇదే పరిస్థితి నెలకొంది.. కరీంనగర్ ప్రతిమ మల్టి ప్లెక్స్ లో అయితే జాతర ను తలిపించి తోపులాట, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కలెక్టరేట్ వరకు యువత క్యూలో నిలబడడం కనిపించింది.

కాగా బాహుబలి టీం రెండు రోజుల క్రితం ప్రపంచంలోనే పెద్ద చానళ్ అయిన దేశవ్యాప్తంగా నెట్ వర్క్ ఉన్న బీబీసీతో మాట్లాడింది. రాజమౌళి, ప్రభాస్, సాబుసిరిల్, తదితరులు బీబీసీతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ వీడియో ఆ చానాళ్ లో ఆదివారం రాత్రి ప్రత్యక్షమైంది.

బాహుబలి హీట్ పెరిగిపోతుండడంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. 200 కోట్ల రూపాయల పెట్టుబడి వారం, పదిరోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *