దేశం గర్వించదగ్గ సినిమా బాహుబలి అవుతుందని.. అలాంటి సినిమా ట్రైలర్ ను హీరో రానా తనకోసం ముందుగా చూపించి నా జన్మ ధన్యం చేశారని అమితాబ్ బచ్చన్ బాహుబలి సినిమాను ఆకాశానికెత్తారు.
భారత దేశ సినీ చరిత్రలోనే ఇది గొప్పచిత్రం అవుతుందని.. ఈ సినిమాను తీసిన రాజమౌళికి తాను అభిమానిగా మారిపోయానని అమితాబ్ అన్నారు. రాజమౌళికి తాను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.