Breaking News

బాహుబలి గోల.. పుష్కర జనం లాల..

00push

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇసుకేస్తే రాలనంత జనం కనపడుతోంది.. పట్టణాల్లో నగరాల్లో బాహుబలి గోలతో ఊగిపోతుంటే.. గోదావరి తీరాల్లోని పుణ్యక్షేత్రాల్లో  మూడు మునకలేసేందుకు జనం సాగిపోతున్నారు.. ఎక్కడ చూసినా తెలంగాణ, ఏపీల్లో ఇప్పుడు బాహుబలి కేక.. పుష్కర కాక కనపడుతోంది..

పుష్కరాలకు జనం పోటెత్తడంతో రహదారులన్నీ వాహనాలతో నిండి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజీవ్ రహదారిపై కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్ గేట్  వద్ద 6 కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. కాళేశ్వరం కు ముందు 35 కి.మీల దూరం వాహనాలు ఆగి భక్తులు నరకం చూపిస్తున్నారు. ధర్మపురికి ముందు 30 కి.మీలు ట్రాఫిక్ తో వాహనాలు నిలిచిపోయాయి. బాసర రహదారి 10 కి.మీల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. భద్రాచలంకు వెళ్లేదారిలో కొత్తగూడెం వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పుష్కర భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక బాహుబలి దేశ, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.. రికార్డులు తిరగరాస్తోంది. 300 కోట్లకు పరుగెత్తుతోంది.. బాహుబలికి పోటీగా విడుదలైన భజరంగీ భైజాన్ కూడా హిట్ కావడంతో థియేటర్ల దొరకక ఆ సినిమా యూనిట్ ఇబ్బంది పడుతోంది.. బాహుబలి ద్విగ్విజయం గా నడవడం.. సల్మాన్ భజరంగీ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు హిందీలో థియేటర్ల కొరత నెలకొంది.. ఈ మంచిపోటీ సినిమాను బతికిస్తోంది.. తెలుగు ఖ్యాతిని ఇనుమడింపచేస్తోంది..

మొత్తానికి బాహుబలి గోల.. పుష్కర గోలతో తెలుగు రాష్ట్రాలు హోరెత్తుతున్నాయి.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *