
హైదరాబాద్, ప్రతినిధి : ఒక్కొక్కటి కాదు .. ఏకంగా వెయ్యి గుర్రాలు.. మహాయుద్ధం జరగబోతోంది.. అది ఎక్కడో కాదు ఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ”బాహుబలి” కోసం వెయ్యి గుర్రాలు సిద్ధమవుతున్నాయట.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాహుబలి కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే.. ఓ అద్భుత యుద్ధ సన్నివేశం కోసం రాజమౌళి వెయ్యి గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. బాహుబలిని అద్భుతంగా తెరకెక్కించేందుకు ఎక్కడా రాజీ పడని రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించడంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో యుద్ధ సన్నివేశం చిత్రీకరణ కోసం రాజమౌళి రాజస్థాన్ నుంచి వెయ్యి గుర్రాలను తీసుకోస్తున్నారట. ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెయ్యి గుర్రాలతో కూడిన యుద్ధ సన్నివేశాన్ని సోమవారం నుంచి షూట్ చేస్తారని సమాచారం. ప్రభాస్, రానా , అనుష్క, తమన్నా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.