Breaking News

బాహుబలిని వేయినోళ్ల పొగిడిన బీబీసీ

bahuballlli

బాహుబలి మూవీ, అది తీసిన రాజమౌళిని వేయినోళ్ల పొగిడింది అంతర్జాతీయ న్యూస్ దిగ్గజం బీబీసీ. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో వచ్చిన ప్రాంతీయ చిత్రం.. ఇండియా సినిమానే శాసిస్తున్న బాలీవుడ్ ను తలదన్ని దేశవ్యాప్తంగా ఆయా భాషల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని బీబీసీ కొనియాడింది.

ఇన్నాళ్లు భారత దేశ సినిమా అంటే అంతా ముంబైని చూపించేవారని.. విదేశాల్లో సైతం బాలీవుడ్ సినిమాలనే చూసేవారని.. కానీ నేడు హిందీని సినిమాను పక్కకు నెట్టి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలుగు ప్రాంతీయ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం దేశానికే గర్వకారణమన్నారు. ఈ సినిమా తీసిన రాజమౌళిని, టీంను, అద్భుతంగా నడిపించారని.. ఇందులోని గ్రాఫిక్స్ వర్క్ కథనం మతిపోగొట్టేలా ఉందని కథనం ప్రచురించింది. దేశం గర్వపడే సినిమా అని కొనియాడింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *