
ముంబై, ప్రతినిధి : శివసేన పార్టీ కొత్త కోరిక కోరింది. ఈనెల 23న బాల్ థాకరే బర్త్ డేకి ‘గూగుల్ డూడుల్’ వేయాలని డిమాండ్ చేస్తోంది. 23 నాడు బాల్ థాకరేపై డూడుల్ వేయాలని శివసేన ఎంపీ రాహుల్ షీవాలే గూగుల్ సంస్థకు లెటర్ రాశారు. అంతేకాకుండా, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ లను కూడా ఈ విషయంలో చోరువ చూపాలని కోరారు. ఏదైనా స్పెషల్ డే ఉంటె గూగుల్ హోం పేజిలో స్పెషల్ గా తమ లోగోని తయరుచేసి పెట్టడం ఆనవాయితీ. స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ లోగోనే ‘డూడుల్’ అని పిలుస్తారు.