Breaking News

బాలుడి తలలో దిగిన కత్తి

01thala

నెల్లూరులో ఓ బాలుడి తలలో కత్తి ప్రమాదవశాత్తు దిగింది. మర్రిపాడు మండలం బాటసింగన్నపల్లి గ్రామానికి చెందిన బాలుడు వాసు(14) పొలంలో తాటి కింద నిల్చొని ఉండగా పైన తాటికాయలు కోస్తున్న వ్యక్తి చేతిలో నుంచి పొడవైన పదునైన కత్తి జారిపడి బాలుడి తలలో బలంగా గుచ్చుకుంది. వెంటనే తల్లిదండ్రులు నగరానికి తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

బాలుడికి శస్త్రచికిత్స చేసి జాగ్రత్తగా కత్తిని తొలగించారు. బాలుడిని ప్రాణప్రాయం నుంచి తప్పించారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *