
తెలుగులో మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు మూవీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ బిగ్గెస్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్, గ్రామాల దత్తతపై తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ సినిమా ఇన్స్పిరేషన్ తోనే తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతిని ప్రారంభించి గ్రామాల దత్తతను ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సల్మాన్ కు సినిమా చూపించిందట.. ఆయన ఈ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఇక బాలీవుడ్ లోనూ తెలుగు శ్రీమంతుడు స్టోరీ రిమేక్ అయినట్టే.. కండల వీరుడు సల్మాన్ మహేశ్ చేసిన పాత్రను పోషించబోతున్నారు. దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు..