బాలికపై సామూహిక అత్యాచారం , హత్య

01crime

రంగారెడ్డి : మద్యం మత్తులో కళ్లూ మూసుకుపోయిన దుండగులు ఓ పదిహేనేళ్ల బాలికను సామూహికంగా అత్యాచారం చేసి హతమర్చారు. రంగారెడ్డి జిల్లా మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన బాలిక(15) ఎనిమిదో తరగతి చదువుతోంది. సెలవులకు మెదక్ జిల్లా రామచంద్రపురంలోని చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. గురువారం ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి తండ్రి వచ్చాడు. ద్విచక్రవాహనంపై వస్తూ  రాత్రి 9.30గంటల ప్రాంతంలో దాహం కోసం బట్వారం మండలం బార్వాద్ రహదారిపై ఆగారు. పక్కనే ఆటోలో మద్యం తాగుతున్న నలుగురు యువకులు బలవంతంగా బాలికను ఆటో ఎక్కించారు. గమనించిన తండ్రి అడ్డుకోగా అతడిని బండరాయితో కొట్టారు. అనంతరం బాలికను అరకిలోమీటర్ తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపేశారు. రోడ్డున పడివున్న తండ్రిని గమనించిన బాటసారులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.  పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *