Breaking News

బాలల సంరక్షణకు 1098 కి కాల్ చేయండి

బాలల సంరక్షణకు 1098 కి కాల్ చేయండి

కరీంనగర్: సమస్యలలో ఉన్న బాలల సంరక్షణ కొరకు 1098కి ఫోన్ చేసి సమాచారం అందించినట్లయితే వెంటనే వారిని రక్షిస్తారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 1098కి చైల్డ్ లైన్ పై అధికారులతో సమీక్షించారు. ఆశ్రయం అవసరమైన బాలలను చూసినపుడు, బాల కార్మికులను గుర్తించినపుడు, తప్పిపోయిన బాలలను చూసినపుడు, వేదింపులకు గురి అవుతున్న బాలలకు చైల్డ్ లైన్ కు ఫోన్ చేసిన యెడల వారు అట్టి బాలలకు రక్షణ కల్పిస్తారని తెలిపారు. ఇంతవరకు 969 ఫోన్ కాల్స్ వచ్చాయని వీరందరిని సంరక్షించినట్లు తెలిపారు. 13 మందికి వైద్య సహయం, 119 మందికి ఆశ్రయం, 699 మందిని బాల కార్మిక, బిక్షటన నుండి విముక్తి, వీధి బాలలకు రక్షణ కల్పించినట్లు తెలిపారు.20 మందికి పునరావాసం, 35 చైల్డ్ లాస్ట్, ఒక పిల్లవాడి తల్లిదండ్రుల సహయం కోరినట్టు, 82 మంది పిల్లలకు అవగాహన కల్పించి సహయం అందించినట్లు తెలిపారు. బాలల సంరక్షణ పైన విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి ఆర్.టి.సి. బస్సుల పైన రైల్వే స్టేషన్లలలో పట్టణాలలో హోర్డింగులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు, చైల్డ్ లైన్ సిబ్బంది విధి నిర్వహణలో సహకరించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 1098 చైల్డ్ లైన్ పైన ప్రజలలో ప్రచారం కల్పించాల్సి ఉందని అన్నారు. ఆర్.టి.సి. బస్సు కండెక్టర్లు, రైల్వే స్టేషన్ మేనేజర్లలకు అనుమానస్పదంగా ఉన్న బాలలను గుర్తించి వెంటనే చైల్డ్ లైన్ కు సమాచారం అందించాలని అన్నారు. కార్మిక శాఖ బాలకార్మికుల నిర్మూలనకు ప్రత్యేక డ్త్ర్రెవ్ లను చేపట్లాలని కోరారు. దుకాణాలలో బాలకార్మికులు పనిచేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ స్వచ్ఛంద సంస్ధ డైరెక్టరు సరోజ, అదనపు జాయింట్ కలెక్టర్ డా.ఎ. నాగేంద్ర, జిల్లా పరిషత్ ముఖ్య నిర్వహణాధికారి సూరజ్ కుమార్, పిడి ఐసిడిఎస్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *