
చైన్నై, ప్రతినిధి : దర్శక దిగ్గజం ఇక మనకు లేరనే చేదు నిజాన్ని తెలుగు, తమిళ సినీపరిశ్రమలు జీర్ణించుకోలేకపోతున్నాయి. బాలచందర్ మృతి నేపథ్యంలో బుధవారం తమిళ సినీపరిశ్రమ సెలవు ప్రకటిస్తున్నట్లు తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ ప్రకటించారు.
బాలచందర్ తో అనుబంధం వున్న ప్రతీ ఒక్కరు ఆయన్ని కడసారి చూసేందుకు బాలచందర్ నివాసానికి చేరుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, ఇంకొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించిన బాలచందర్ దక్షిణాది సినీపరిశ్రమకు ఓ దర్శక దిగ్గజంగా ఎదిగారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అభిప్రాయపడ్డారు