
హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన నర్సింహారెడ్డి హత్యపై ఏపీ అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ఆ హత్యపై విచారణ చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ హత్య కేసుతో ఎంపీ అవినాశ్ రెడ్డికి సంబంధం లేదని జగన్ పేర్కొన్నారు. ఒక వేళ మీరు సంబంధం ఉందనుకుంటే బాలకృష్ణ కాల్పలు ఘటనకు చంద్రబాబుకు సంబంధం ఉన్నట్టే అని అనడంతో సభలో దుమారం చెలరేగింది. జగన్ క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.