Breaking News

బాలకార్మికులను బీహార్ కు తరలింపు

children2

హైదరాబాద్, ప్రతినిధి : హైదరాబాద్ లో మగ్గిపోయిన బాలకార్మికులకు విముక్తి కల్పించిన అధికారులు ఇఫ్పడు వారి స్వస్థలాలకు పంపి వారి బాధలనుంచి శాశ్వతంగా విముక్తి కల్పించారు. గురువారం 80మంది బాలకార్మికులను పాట్నా ఎక్స్ ప్రెస్ లో ప్రత్యేకబోగిని ఏర్పాటు చేయించి సమాచార శాఖ కమిషనర్ , కార్మిక శాఖ కమిషనర్ నేతృత్వంలో చిన్నారులను తరలించారు. సౌత్ జోన్ పోలీసులు చేపట్టిన కార్డన్ అండ్ సెర్చ్.. ఆ తర్వాత ఆపరేషన్ స్మైల్ టీమ్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్లు అనేక మంది బాల కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 400 మంది పిల్లలకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. వీరంతా బీహార్, గయా, కోల్ కతా ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. పిల్లలను స్వస్థలాకు పంపేందుకు ఆయా రాష్ట్రాల అధకారులతో సంప్రదింపులు జరిపారు. ఇప్పటివరకు 200 మంది చిన్నారులను బీహార్ కు తరలించారు. పిల్లలతో పాటు 12 మంది పోలీసులు, అధికారులను పంపించారు. బీహార్ కు తరలివెళుతున్న బాలలు సంతోషం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *